హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: యువత భవిష్యత్తుకు భరోసా.. ఎస్పీ ప్రత్యేక చొరవ

ASF: యువతకు ఉజ్వల భవిష్యత్తు కల్పించడమే లక్ష్యంగా పోలీస్ ఉద్యోగాల కోసం ప్రత్యేక కోచింగ్ అందిస్తున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు. ప్రత్యేక పరీక్ష ద్వారా 157 మంది విద్యార్థులను ఎంపిక చేశామని, వారికి మూడు నెలల పాటు వసతితో కూడిన శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. యువతను సన్మార్గంలో నడిపించడమే లక్ష్యమన్నారు.