హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

విటమిన్-డి లోపమా? ఇలా చేయండి!

ఉదయం 9 గంటలలోపు వచ్చే లేత సూర్యరశ్మి శరీరానికి తగలడం ఎంతో అవసరం. దీనివల్ల మనకు సహజసిద్ధంగా విటమిన్-డి లభిస్తుంది. ఇది ఎముకలను, కండరాలను దృఢంగా మార్చడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజూ ఉదయం అరగంట పాటు ఎండలో వాకింగ్ లేదా వ్యాయామం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, రోజంతా ఫ్రెష్‌గా ఉంటారు. డిప్రెషన్, నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి మార్నింగ్ వాక్ గొప్ప ఔషధం.