హైదరాబాద్: 28°C
తెలంగాణ

పఖీరా తండాలో నూతన పెన్షన్ల సూపర్ చెకింగ్

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పఖీరా తండా గ్రామపంచాయతీలో ఇటీవల మంజూరైన పెన్షన్లపై అధికారులు సూపర్ చెకింగ్ నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి, మండల ప్రత్యేక అధికారి రేవంత్, ఎంపీవో బండి అశోక్‌తో కలిసి లబ్ధిదారుల వివరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుగులోతు కైలా రవి, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి బానోతు సరిత పాల్గొన్నారు.