WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాల సమీపంలో జాతీయ రహదారి 563పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి పెట్రోల్ బంక్ ముందు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్కు గాయాలయ్యాయి. లారీలో గానుగ నూనెను తరలిస్తుండగా ప్రమాదం జరగడంతో నూనె రోడ్డుపై పారిపోయి వృథా అయింది. దీంతో కొంత సేపు ట్రాఫిక్ స్తంభించింది.
తెలంగాణ
లారీ బోల్తా.. రోడ్డుపాలైన గానుగ నూనె


