హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్టోబర్ 15 లోగా ఈ-కెవైసి పూర్తి చేయాలి: జేసీ

SS: జిల్లాలో రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ నమోదు ప్రక్రియను OCT 15లోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సూచించారు. జిల్లాలో 50,427 యూనిట్లకు ఈ-కేవైసీ పెండింగ్‌లో ఉండగా, 3,12,657 కార్డులకు ఆధార్ లింక్ మొబైల్ నంబర్లు నమోదు కావాల్సి ఉంది. రేషన్ డీలర్/గ్రామ, వార్డు సచివాలయంలో ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్నారు.