హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుట్టి ఘాట్ సమీపంలో రాత్రి రోడ్డు ప్రమాదం

ADB: నెరడిగొండ మండలంలోని కుట్టి ఘాట్ సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లారీ, కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది.