JGL: పెగడపల్లి (M) రాజారాంపల్లి నుంచి లంబాడితండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి 2023లో ఎస్టీ-ఎన్డీఎఫ్ నిధుల నుంచి రూ.33.70 లక్షలు మంజూరయ్యాయి. అదే ఏడాది ఆగస్టులో అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. మూడేళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభం కాకపోవడంతో శిలాఫలకం అలంకారప్రాయంగా మారింది. అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరారు.
తెలంగాణ
శిలాఫలకానికే పరిమితమైన బీటీ రోడ్డు పనులు


