హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలికపై వేధింపులు.. యువకుడిపై పోక్సో కేసు

KNR: హుజూరాబాద్‌ పట్టణ పరిధిలోని పోతిరెడ్డిపేటకు చెందిన నితీశ్‌ అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ టి. కరుణాకర్‌ మంగళవారం తెలిపారు. ప్రేమ పేరుతో ఓ బాలికను మోసం చేసి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెల్లడించారు.