అమలాపురం మున్సిపాలిటీలో 36 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ మంగళవారం రాత్రి ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. వీటిలో ఎస్టీ లకు 1, ఎస్సీ లకు 5, బీసీ లకు 12, మహిళలకు 10 వార్డులు కేటాయించారు. మరో 8 వార్డులు జనరల్ కు ప్రకటించారు. రిజర్వేషన్లు ప్రకటనతో ఆశావహులు అప్రమత్తమయ్యారు. తమకు అనుకూలమైన వార్డులలో పోటీ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
అమలాపురం: 36 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు


