హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్సవాలకు రూ.1.50 కోట్ల మంజూరు

ASF: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దండారి–గుస్సాడి ఉత్సవాల నిర్వహణకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రూ.1.50 కోట్ల నిధులు మంజూరు చేయడంపై ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ హర్షం వ్యక్తం చేశారు. దీపావళి సందర్భంగా ఆదివాసీ గ్రామాల్లో నిర్వహించే ఈ ఉత్సవాలు వారి కళలు, ఆచార వ్యవహారాలకు ప్రతిబింబమని పేర్కొన్నారు.