ASF: ఆసిఫాబాద్ మండలంలోని జానకాపూర్ లో ఈనెల 15న ఉదయం 10 గంటలకు కిసాన్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కె. హరిత తెలిపారు. ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, నూతన సాగు పద్ధతులు, ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు. వివిధ శాఖల స్టాళ్లు ఏర్పాటు చేసి రైతుల సమస్యలకు సూచనలు అందిస్తారు. రైతులు పాల్గొని మేళాను విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
ఈనెల 15న జానకాపూర్ లో కిసాన్ మేళా


