ASR: చింతపల్లి అటవీ డివిజన్ పరిధిలోని పెదవలస అటవీ రేంజ్ అధికారిగా సింహాచలం పడాల్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. చోడవరం రేంజర్గా పనిచేస్తున్న ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. అనంతరం కాకరపాడులోని రేంజ్ కార్యాలయాన్ని, ఐటీడీఏ కాలనీ వద్ద కలప డిపోను సందర్శించి సిబ్బందితో సమావేశమయ్యారు. ఇప్పటివరకు లోతుగెడ్డ రేంజర్ ప్రశాంతి కుమారి ఇన్చార్జిగా వ్యవహరించారు.
ఆంధ్రప్రదేశ్
పెదవలస అటవీ రేంజర్గా సింహాచలం పడాల్


