హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుడుంబా తయారీపై పోలీసుల దాడులు

MHBD: కేసముద్రం మండలంలోని కోరుకొండపల్లి శివారు మేఘ్యతండాలో మంగళవారం పోలీసులు ఇంటింటా తనిఖీలు నిర్వహించారు. సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో 30 మంది పోలీసులు గుడుంబా తయారీకి ఉపయోగించే 4 వేల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 50 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. 50 ద్విచక్రవాహనాలను తనిఖీ చేసి, ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. గుడుంబాను అరికట్టడానికి ప్రజలు సహకరించాలని కోరారు.