హైదరాబాద్: 28°C
తెలంగాణ

శబరిమలై కి పాదయాత్ర చేస్తున్న స్వాములు

JGL: మెట్పల్లి నుంచి శబరిమలై వరకు పాదయాత్ర చేస్తున్న అయ్యప్ప దీక్షాపరులకు మంగళవారం కథలాపూర్లో అయ్యప్ప సంఘం సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి పూజలు,భజనలు చేశారు. అనంతరం పోసానిపేట గ్రామ శివారులో పాదయాత్ర చేస్తున్న అయ్యప్ప దీక్షాపరులకు భోజనం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో మండల అయ్యప్ప సేవా సంఘం సభ్యులు రాజేశ్,నాగేశ్వరావు,కిషన్ ఉన్నారు.