హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ తొలి సీఈవో గా వసంత మాధవి

కోనసీమ: జిల్లా ప్రజా పరిషత్ సీఈవో గా పి.వసంత మాధవి నియమితులయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె కాకినాడ జిల్లా ఏపీడీగా విధులు నిర్వర్తిస్తుంది. ఈ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆమె సేవలను గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఉపసంహరించారు. తొలి సీఈవోగా ఆమె బాధ్యతలు నిర్వర్తించనున్నారు.