హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత

JN: రఘునాథపల్లి మండలంలోని వెల్ది వాగు నుంచి అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఈ ఘటనలో రఘునాథపల్లికి చెందిన పల్లపు మురళి, ట్రాక్టర్ డ్రైవర్ పల్లపు కృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై భరత్ తెలిపారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.