హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే

ప్రకాశం: రాచర్ల (M)చోళవీడు గ్రామంలోని వడ్డెర బజారులో నెలకొన్న తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే అశోక్ రెడ్డి స్పందించారు. మంగళవారం స్థానికుల విజ్ఞప్తి మేరకు అధికారులను అప్రమత్తం చేసి బోరు వేయించి తాగునీటి సరఫరా పునరుద్ధరించారు. దీంతో స్థానికులకు తాగునీటి ఇబ్బందులు తొలగడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ఎమ్మెల్యేకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.