హైదరాబాద్: 28°C
తెలంగాణ

చైనా పర్యటనకు ఒగ్గుకథ కళాకారుడు

JN: చైనా సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానంపై అధ్యయనం చేసేందుకు భారత్‌ నుంచి వెళ్లనున్న ఏడుగురు సభ్యుల బృందంలో లింగాలఘనపురం మండలం మాణిక్యపురానికి చెందిన ఒగ్గుకథ కళాకారుడు చౌదరపల్లి రవికుమార్‌ మంగళవారం ఎంపికయ్యారు. ఈ నెల 18న చైనాకు బయలుదేరనున్న బృందం వారం రోజులపాటు అక్కడ పర్యటించనుంది. దేశం తరఫున సాంస్కృతిక ప్రతినిధిగా ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు.