WGL: వడదెబ్బతో మహిళా వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన నల్లబెల్లి మండలం బోళ్లొనిపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పొలుదాసరి రాజేశ్వరి (54) పత్తి ఏరేందుకు పొలానికి వెళ్లగా ఎండ తీవ్రతకు స్పృహతప్పి పడిపోయారు. ఆసుపత్రులకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
వడదెబ్బతో మహిళా కూలీ మృతి


