NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి లో ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర దుర్గామాత నవరాత్రుల సందర్భంగా బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, వాటి చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: బతుకమ్మ పండుగలో మహిళల సందడి


