హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల వేళ డిఎస్పీ సమావేశం

SKLM: రాబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని DSP ధనుంజయ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి దమ్మలవీధి‌లో ఉన్న సచివాలయం ప్రాంగణంలో ప్రజలతో సమావేశం నిర్వహించారు. ప్రజా శాంతికి భంగం కలిగించే చర్యలకు పాల్పడవద్దని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.