MDCL: రామంతాపూర్ శ్రీనగర్ కాలనీకి చెందిన రమ్య (26) పార్ట్టైమ్ ఉద్యోగం పేరుతో సైబర్ మోసానికి గురైంది. ఇన్స్టాగ్రామ్లో వచ్చిన జాబ్ ప్రకటనను క్లిక్ చేయగా, టెలిగ్రామ్ ద్వారా పరిచయమైన కేటుగాళ్లు మాల్ ఆర్డర్లు పూర్తి చేస్తే కమీషన్ ఇస్తామని నమ్మించారు. ఈ క్రమంలో ఆమె నుంచి రూ.1,88,860 వసూలు చేసి, కేవలం రూ.4,940 మాత్రమే తిరిగి చెల్లించారు.
తెలంగాణ
పార్ట్ టైమ్ ఉద్యోగం పేరుతో రూ.1.88 లక్షలు స్వాహా!


