AKP: మునగపాక మండలం గొల్లలపాలెంలో అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రైతు నంబార అప్పారావుకు చెందిన పశువుల పాక దగ్ధమైంది. ఈ ఘటనలో ఒక ఆవు, మేక, 10 కోళ్లు సజీవ దహనమయ్యాయి. సుమారు రూ.1.20 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని వేడుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పశువుల పాక దగ్ధం


