హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్ద చింతకుంటలో ఘనంగా కుంకుమార్చన

NRPT: మరికల్ మండలంలోని పెద్ద చింతకుంట గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. దుర్గాదేవి గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించిన కుంకుమార్చనలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మవారి పూజలతో మండపం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అనంతరం తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.