హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చింతపల్లి గురుకుల కళాశాలలో కౌంటింగ్ కేంద్రం

ASR: స్థానిక సంస్థల ఎన్నికల స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రంగా చింతపల్లి గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలను ఎంపిక చేసినట్లు MPDO లాలం సీతయ్య తెలిపారు. తహశీల్దార్ త్రివేణి, సీఐ సింహాచలంతో కలిసి ఆయన కళాశాలను పరిశీలించారు. బ్యాలెట్ బాక్సుల భద్రత, కౌంటింగ్‌కు అనువైన భవనాలను తనిఖీ చేశారు. నోటిఫికేషన్ విడుదల నుంచి నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.