హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటింటికీ పింఛను దరఖాస్తుల పరిశీలన

NGKL: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పింఛన్లు అందుతాయని ఎంపీవో బలరామ్ నాయక్ స్పష్టం చేశారు. కోడేరు మండలం తీగలపల్లి గ్రామంలో పింఛను కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అర్హతలను ఆయన స్వయంగా ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేశారు. లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి, త్వరలోనే ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామన్నారు.