KDP: పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ హెల్ప్లైన్ నంబర్ 9490864264ను జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ మంగళవారం ప్రారంభించారు. ప్రజలు తమ సమస్యలు, అత్యవసర సమాచారాన్ని ఈ నంబర్ ద్వారా పోలీసులకు తెలియజేయవచ్చని తెలిపారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి ప్రజలకు అవసరమైన పోలీసు సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పులివెందులలో పోలీస్ హెల్ప్లైన్ ప్రారంభం


