హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తిశ్రద్ధలతో కృష్ణమ్మకు నవహారతులు

NTR: విజయవాడ దుర్గా స్నానఘాట్‌లో దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పవిత్ర కృష్ణమ్మకు నవహారతులు సమర్పించారు. దేవీ శరన్నవరాత్రుల వేళ హారతుల వెలుగులతో ఘాట్‌ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కృష్ణమ్మకు హారతులు సమర్పించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని నదీమతల్లికి నీరాజనాలు పలికారు.