హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజలకు ఇంటి పెద్ద కొడుకులా అండగా ఉంటా'

KMR: జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు ఇంటి పెద్ద కొడుకులా అండగా ఉంటానని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. బతుకమ్మ ముగింపు వేడుకల్లో మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రజల ఆశీర్వాదాలతో మరింత సేవ చేస్తానని, బతుకమ్మ పండుగ అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని ఆకాంక్షించారు.