NZB: మోపాల్ పోలీస్ స్టేషన్ను ఏసీపీ బి. ప్రకాష్ మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్ హౌస్, క్రైమ్ రికార్డులు, కేసు డైరీలు, పెండింగ్ కేసులు, వారెంట్ల అమలు తీరును పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, నాన్ బెయిలబుల్ వారెంట్లు త్వరగా అమలు చేయాలని, నేర చరిత్ర కలిగిన వారిపై నిఘా ఉంచాలని సిబ్బందికి సూచించారు.
తెలంగాణ
పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఏసీపీ


