హైదరాబాద్: 28°C
తెలంగాణ

చదువుతోపాటు క్రీడల్లో యువత రాణించాలి

PDPL: జూలపల్లి మండలoలో 12వ వార్డు సభ్యురాలు వనిత ఆధ్వర్యంలో క్రికెట్ జట్టు క్రీడాకారులకు టీ షర్ట్‌లను పంపిణీ చేశారు. చదువుతో పాటు క్రీడల్లోనూ యువత రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ కొమ్మ పోషాలు, ఉపసర్పంచ్ మహేశ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.