హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KNR: విద్యుత్ మరమ్మతుల్లో భాగంగా బుధవారం పలు ప్రాతల్లో విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నట్లు రూరల్ ఏడీఈ రఘు తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రేకుర్తి వరుణ్ మోటార్స్ పరిసరాలు, అక్షయ హోమ్స్, మెహర్ మెడోస్, గౌడ్స్ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.