హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీటి సరఫరాకు అంతరాయం

శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని 1 నుంచి 50 వార్డులలో ఈ నెల 15, 16వ తేదీల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. స్థానిక గొంటి వీధి వాటర్ పైప్‌ లైన్‌కు మరమ్మతులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.