హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా పోరాటాలతో కదిలిన యంత్రాంగం

ASR: బొండం పంచాయతీ కొలియగూడ నుంచి కొత్తవలస వరకు కిలోమీటరు తారు రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. 2019లో మంజూరైనా ప్రభుత్వాలు, కాంట్రాక్టర్లు మారడంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఆదివాసీ గిరిజన సంఘం, సీపీఎం, గ్రామస్తుల పోరాటాలు, ధర్నాలు, పీజీఆర్ఎస్ ఫిర్యాదుల ఫలితంగా పనులు ప్రారంభమయ్యాయని నాయకులు తెలిపారు.