హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై కలెక్టర్ సమీక్ష

తూ.గో: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల ఖరారులో ప్రభుత్వ మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. గతంలో ఖరారు చేసిన రిజర్వేషన్లు, ప్రస్తుత గణాంకాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి తప్పులకు తావులేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.