హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మానసా దేవి ఆలయానికి పోటెత్తిన మహిళా భక్తులు

KDP: సిద్ధవటం మండలం కనుమలోపల్లి సమీపంలోని శ్రీ మానసా దేవి ఆలయానికి శరన్నవరాత్రుల మూడో రోజు మంగళవారం మహిళా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుంటే కుటుంబ, ఆరోగ్య సమస్యలు తొలగుతాయన్న నమ్మకం ఉందని భక్తులు తెలిపారు. ఆలయ ధర్మకర్త లక్ష్మయ్య భక్తులకు వసతులతో పాటు అన్నప్రసాదం అందిస్తున్నారని పేర్కొన్నారు.