KDP: సిద్ధవటం మండలం లింగంపల్లి రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్ 164లో ఉన్న 101.09 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగా నమోదైందని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం భూమి వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఈ భూమికి సంబంధించి సిద్ధవటం కోర్టులో 3 కేసులు విచారణలో ఉన్నాయని, తుది తీర్పు వచ్చిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని VRO రజిని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ భూమి వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు


