హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఉచిత మెగా వైద్య శిబిరం

విశాఖపట్నంలో ట్రాన్స్‌జెండర్ల ఆరోగ్య భద్రత కోసం అక్టోబర్ 27న ఏఆర్ గ్రౌండ్స్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. నగర పోలీసుల ఆధ్వర్యంలో కోరమండల్ సంస్థ, నీ తోడు సొసైటీ సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. 250 మందికి పైగా ట్రాన్స్‌జెండర్లకు వైద్య పరీక్షలు, ల్యాబ్ టెస్టులు నిర్వహించి ఆరోగ్యంపై అవగాహన కల్పించనున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు.