KDP: ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఐ కొండారెడ్డి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. శాంతిభద్రతలను కాపాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్సై మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికలపై పోలీసులకు సీఐ దిశానిర్దేశం


