హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడిపత్రిపై ఎస్పీ స్పెషల్ ఫోకస్

ATP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తాడిపత్రిలో జిల్లా ఎస్పీ జగదీష్ పర్యటించారు. ఈవీఎంల పంపిణీ, కౌంటింగ్ కేంద్రాలు, నామినేషన్ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలైన నందలపాడు, ఓంశక్తి నగర్, శ్రీనివాసపురంలో పర్యటించి పోలీసులకు సూచనలు చేశారు. ఎన్నికల్లో అల్లర్లు, గొడవలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.