హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సామర్లకోట మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ పోటీ

కాకినాడ: సామర్లకోటలో మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని పార్టీ నాయకులు తెలిపారు. మంగళవారం మెహర్ కాంప్లెక్స్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా ఆప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వరదరాజ సాంచి పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పోస్టర్‌ను ఆవిష్కరించారు.