హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైక్‌లు ఢీ.. ఇద్దరు మృతి

ప్రకాశం: పొదిలి(M) మల్లవరం దగ్గర రెండు బైకులు ఢీకొని ఇరువురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. గొల్లపల్లికి చెందిన చెంచిరెడ్డి మల్లవరం వచ్చి ద్విచక్ర వాహనంపై తిరిగి స్వగ్రామానికి వెళుతున్నాడు. అదే సమయంలో మల్లవరానికి చెందిన కార్తీక్ అనే యువకుడు పొదిలి వైపు నుంచి ద్విచక్ర వాహనంపై మల్లవరం వస్తూ ఇరువురు వ్యక్తులు ఎదురుగా ఢీకొట్టుకొని అక్కడిక్కడే మృతి చెందారు.