హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

గుండె, ఎముకల ఆరోగ్యానికి బెస్ట్ స్నాక్!

మఖానాలో క్యాలరీలు తక్కువగా, ప్రోటీన్, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రోజూ గుప్పెడు మఖానాను నెయ్యిలో వేయించుకుని తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎముకలు, కీళ్లను బలోపేతం చేయడంలో తోడ్పడుతాయి. ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారికి మంచి ఆహారం. రక్తపోటును నియంత్రణలో, గుండె పనితీరును సక్రమంగా ఉంచుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బుల ముప్పును దూరం చేస్తాయి.