హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఉదయాన్నే అరటిపండు తింటున్నారా?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండు తీసుకుంటే అందులో ఉండే సహజమైన ఆమ్లాలు, మెగ్నీషియం గ్యాస్, ఎసిడిటీ, కడుపులో అసౌకర్యానికి దారితీస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగి, ఆ తర్వాత వెంటనే నీరసం వచ్చే అవకాశం ఉంటుంది. ఐరన్ తక్కువగా ఉండే వారికి లేదా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారికి పరగడుపున అరటిపండు పడకపోవచ్చు. అల్పాహారం తిన్న తర్వాత లేదా ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే మంచిది.