ATP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లాలో హైపర్ సెన్సిటివ్ గ్రామాల్లో పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాలతో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు రాత్రి బస చేసి ప్రజలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో ప్రశాంత వాతావరణం పాటించాలని, ప్రలోభాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామాల్లో పోలీసుల పల్లెనిద్ర


