సౌదీ అరేబియాపై హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడుల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై తీవ్రంగా పడింది. ఈ దాడుల నేపథ్యంలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర ఒక్కరోజే 2.18 శాతం మేర పెరిగి 107 డాలర్లకు చేరుకుంది. ఈ ఉద్రిక్తతలతో చమురు సరఫరాపై ప్రభావం పడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
వ్యాపారం
హౌతీల దాడుల ఎఫెక్ట్.. పెరిగిన ఆయిల్ ధర


