హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిద్దలూరు పోలీస్ స్టేషన్‌లో తనిఖీలు

ప్రకాశం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గిద్దలూరు పోలీస్‌స్టేషన్‌ను డీఎస్పీ సత్యనారాయణ సోమవారం తనిఖీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు సిబ్బందికి సూచించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం నిఘా ఉంచాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.