PLD: రొంపిచర్ల వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. మూడవ రోజు అయినా మంగళవారం అమ్మవారు శ్రీ వైష్ణవి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు వేములరావు ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక పూజలు జరిగాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ వైష్ణవి దేవిగా అమ్మవారి దర్శనం


