హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 14న ఉద్యోగాల ఎంపిక

ELR: జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 14న ఉదయం 10 గంటలకు ఉద్యోగాల ఎంపిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వరలక్ష్మి తెలిపారు. ఫ్లిప్‌కార్ట్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల్లో వివిధ పోస్టులకు ఎంపిక చేస్తామన్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన 18–45 ఏళ్ల పురుషులు, మహిళలు అర్హులు. నెలకు రూ.12 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనం ఉంటుంది.