హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు'

ATP: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం రూరల్ ఏఎస్పీ అశ్విన్ మణిదీప్ హెచ్చరించారు. బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఆయన, సమస్యాత్మక ప్రాంతాల వ్యక్తులతో సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపై అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.